Sunday, December 16, 2018

సాయి బాబా ఉద్యమము - సద్ధర్మాచారణకు శంఖారావము

ఓం సాయి మాస్టర్

================================

To Receive DAILY MESSAGES from MANNAVA SATYAM

Please Visit :
smaharshi.blogspot.com



సాయిబాబా ఉద్యమము
సాయిబాబాఉద్యమము!సద్ధర్మాచరణకు శంఖారావము !
సర్వ మానవాళికి షిరిడి  సాయిబాబ వారిని పరిచయము చేద్దాము !సాయి మానవాళిని ఉద్దరిస్తారు 
...సాయి మాస్టర్ స్మరణలో ..., మన్నవ సత్యం
==================================== సాక్షాత్ పరమాత్మ శిరిడి సాయిబాబా మరియు సద్గురు భరద్వాజ మాస్టర్ గారుమనలను సదా అనుగ్రహించాలని ప్రార్ధిస్తున్నాను.


మన జీవితాలు మన పిల్లల జీవితాలు ఇంకా సర్వమానవాళి జీవితాలు సుఖ సంతోషాలతో శాంతి ఆనందాలతో సాగిపోవాలని మనమంతా  మనస్పూర్తిగా  కోరుకొంటాము.మానవులలోని అనేక దుర్గుణాలు మానవులకు సుఖ శాంతులు లేకుండా చేస్తున్నాయి. మానవులలోని ఈ దుర్గుణాలను తొలగించి  వాటి స్థానములో ప్రేమ శాంతి సహనము త్యాగము మొదలైన సద్గుణాలను నింపితే మానవుల ప్రవర్తన మారుతుంది.ప్రేమ శాంతి సహనం త్యాగం మొదలైన సద్గుణాలవల్ల మానవుడు వ్యక్తిగతం గా శాంతి గా ఉండగలుగుతాడు. అంతే గాక సమాజానికి హాని కలిగించక సుఖ శాంతి ఆనందాలు పంచగలుగుతాడు. సమాజములో సద్గుణాలు గల మానవుల సంఖ్య పెరిగే కొద్దీ సమాజంలొ అశాంతి తగ్గుతూ వస్తుంది. ఎక్కువమంది సద్గుణాలు అలవరుచుకుంటూ ఉంటే అశాంతి కూడా  ఇంకా ఇంకా తగ్గుతూ ఉంటుంది.  అందువల్ల మానవులను సద్గుణాలు గలవారిగా మార్చగల ప్రక్రియ నిరంతరము జరుగుతూనే ఉండాలి. మానవాళి సద్గుణాలు కలిగి ఉంటేనే సమాజము సుఖ శాంతులతో ఉండ గలుగుతుంది. అందువల్ల ఇది అత్యంత ముఖ్యమైన విషయము. మనము పట్టించుకోవలసిన సంగతి.
   
మానవాళిలో ప్రేమ సహనము త్యాగము నిష్కామకర్మ దానము మొదలైన సద్గుణాలు తమ సహజ గుణాలుగా నాటుకుపోవాలి. అలా మార్పుచెందించే ప్రక్రియ నిరంతరము జరుగుతూ ఉంచడానికి ఒక సులభమైన మార్గము ఉంది. మానవుని మనసు ఎప్పుడూ ఎవరినైతే తలుచుకుంటూ ఉంటుందో వారిగుణాలు మానవుని లో నాటుకుంటూ ఉంటాయి.మానవుని నడవడిక ప్రవర్తన స్వభావము క్రమంగా ఎవరిని తలుచుకుంటూ ఉంటామో వారివలే క్రమముగా మారిపోతూ ఉంటాము. సాక్షాత్ పరమాత్మ పరిపూర్ణ దత్తావతారమూ దైవగుణాలు, సద్గుణాలు పరిపూర్ణం గా నిండివున్న శిరిడి సాయిబాబా వారిని ఎక్కువగా ఎక్కువమంది గుర్తుపెట్టుకుంటూ ఉంటే   మానవులలొ సద్గుణాలు నెలకొంటాయి. క్రమముగా అవి మన సహజ గుణాలు అవుతాయి.అంతేకాక శిరిడి సాయి పరమాత్మ కనుక పరమాత్మను తలుచుకుంటూ ఉంటే పరమాత్మ లక్షణాలు వస్తాయి కనుక, సద్గుణాలతొ పాటు పరమాత్మ లక్షణాలు అలవడి క్రమమముగా మానవ జీవిత లక్ష్యమైన ముక్తి మార్గములో కూడా పురోగతి సాధించి పరమాత్మగా పరిణామము చెందగలము.     అందువల్ల మానవులందరు శిరిడి సాయిబాబా ను గుర్తుంచుకునేటట్లు చేయాలి. ఇది మానవులందరు తమ బాధ్యతగా  గుర్తించాలి ఇది సాధించడానికి మానవులందరిని శిరిడి సాయిబాబా కు సన్నిహితం చేసుకుంటూ పోవాలి. శిరిడి సాయిబాబా చరిత్ర పుస్తకాలు మానవులందరికి అందించడము ద్వారా మనము మానవులందరికి భాబా ను సన్నిహితము చేయవచ్చు. నేను అలా బాబాను అందరికి సన్నిహితము చేయదానికి ప్రయత్నిస్తున్నాను. పాటుపడుతున్నాను. బాబా చరిత్ర పుస్తకాలు ఎక్కువ మందికి అందజేసే ప్రయత్నం చేస్తున్నాను.   శిరిడి సాయిబాబా నే ఎందుకు పరిచయము చేయాలి అంటే , మనము మానవులందరి గురించి ఆలోచిస్తున్నాము. అందరిని సద్గుణవంతులు గా మార్చటానికి చేస్తున్న ప్రయత్నమిది.  మనవ సమాజము  సుఖ సంతోషాలతో, శాంతి ఆనందాలతో నిండాలని తదుపరి శాశ్వత దైవనందము పొందాలని ఆశిస్తున్నాము. శిరిడి సాయిబాబా నే ఎందుకు?! అంటే మానవులను ఇలా కోరుకుంటున్న రీతి లో పరిణామము చెందించడానికి ఆ పరమాత్మ దత్త ప్రభువు అవతారము దాల్చి మానవులకు తనను తాను దత్తం చేసుకున్నాడు. దత్తావతారము యొక్క ప్రయోజనము అదే. అందుకే దత్తవతారమునకు ముగింపు అంతము లేదు. అందుకే సుఖ శాంతులతో నిండిన మనము కోరిన మానవ సమాజము ఏర్పరచుకోవటము కోసము దత్త ప్రభువును ఆశ్రఇంచాలి.     దత్త ప్రభువు నేటి కాలములో పరిపూర్ణ దత్తావతారముగా, శిరిడి సాయి గ ప్రకటమైనారు. అందరు ఆమోదించగల రీతిన ప్రకటమైనారు. అందుకే ఆయనకు జాతి, మతము , సాంప్రదాయము, కులము లేవు. శిరిడి సాయి వాటికీ అతీతుడు. అందుకే శిరిడి సాయి అందరికి ఆమోదయోగ్యుడు. మానవులందరూ తమ జాతీయతను, తమ తమ మతాలను, సంప్రదాయాలను, కులాచారాలను ఆచరిస్తూనే నిత్య జీవిత కార్యక్రమము లో భాగముగా రోజు కాసేపు శిరిడి సాయి ని గుర్తు చేసుకుంటూ ఉంటె చాలు. అందుకు రోజు కొంతసేపు సాయి చరిత్ర చదువుకుంటే చాలు. మనము అనుకున్న శాంతియుత ఆదర్శ మానవ సమాజము ఎర్పరచుకొగలము. ఈ జన్మ ఎలాగో లా గడిచి పోతుంది కదా అని  నిర్లక్ష్యము చేయకండి. మన జన్మ మరణము తో ముగిసి పోదు. బాబా ను స్మరిస్తున్నందు వలన మనము మరల మనవులుగానే జన్మిస్తాము. అప్పుడు సమాజము ఇప్పటికంటే మరింత దుర్గుణాల తో నిండి ఉన్నదంటే మనకు మరింతగా అశాంతి, కష్టము ఎదురవుతాయి. రాబోవు జన్మలలో కూడా మనము మన పిల్లల సుఖ శాంతులతో జీవించాలంటే మనము బాబాను అందరికి సన్నిహితము చేసుకుంటూ పోవటము తప్పనిసరి అని తెలుసుకోండి.                                                                                            .    మన ప్రాణానికి ప్రాణముగా మనము పెంచుకునే మనపిల్లలను అశాంతి అభద్రతల మధ్య వదిలి వెళ్ళగలమా మనము చెప్పండి. అలా వెళ్ళలేము. అలా వదిలి వెళ్ళడానికి మన మనసు అంగీకరించదు.
    మనము తాత్కాలికముగ ఈ సమాజమును వదలి వెళ్ళే ముందు సాధ్యమైనంతగా బాబాను సమాజానికి సన్నిహితము చేసి, అందరిలో సద్గుణాలు పరమాత్మ గుణాలు నాటే ప్రయత్నము చేస్తూ పిల్లలను సుఖ శాంతులు గల సమాజములో వదలి వెళ్ళే ప్రయత్నము చేద్దాము.   అందువల్ల ఇది జన్మజన్మలుగా జన్మజన్మలకోసం  కొనసాగించాల్సిన ప్రయత్నమని మరిచిపోకండి. మనకు మనము, మన పిల్లలకోసం మనమూ, మనసమాజము కోసము మనము చేయగల ఉత్తమమైన మేలు, సహాయము ఇదే నని మరువకండి.ఈ ప్రయత్నము ఎంతమేలు చేస్తుందో మీరు హ్రుదయపూర్వకముగా గుర్తించండి.
e-mail  : saibabamovement@gmal.com
సాయి మాస్టర్ స్మరణలో
మన్నవ సత్యం

smaharshi.blogspot.com
                                                                                                                                             

No comments:

Post a Comment